తెలంగాణ వస్తే నష్టమని ముందే చెప్పా...కంచె ఐలయ్య సంచలన వ్యాఖ్యలు...

తెలంగాణ వస్తే ఈ ప్రాంతం నష్టపోతుందని ఉద్యమ సమయంలోనే చెప్పానని ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకుడు కంచె ఐలయ్య తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అయిన కొత్తలో ఆర్థికంగా ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రమని చూపించే ప్రయత్నం జరిగిందని, అందులో భాగంగానే రైతు బంధు, పెన్షన్ స్కీములు ప్రవేశపెట్టారని, అయితే ఎన్నికలు గెలిచేందుకు ఉపయోగపడ్డ పథకాలు, తర్వాత సామాజిక పురోగతికి అడ్డంకిగా మారాయని కంచె ఐలయ్య తెలిపారు. అంతేకాదు కోస్తా ప్రాంతంలోని అభివృద్ధి చెందిన ప్రాంతాలు తెలంగాణ నుంచి విడిపోవడం వల్ల ఈ రాష్ట్రం మధ్య ప్రదేశ్ లా మారుతుందని ముందే చెప్పానని, హైదరాబాద్ ఒక సాదాసీదా భోపాల్ నగరంలా భవిష్యత్తులో దిగజారవచ్చని కంచె ఐలయ్య అంచనా వేశారు. అయితే తన అంచనా తప్పలేదని ప్రస్తుతం అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని అన్నారు. తీరప్రాంతం ఉన్న ప్రాంతాలే అభివృద్ధి చెందుతాయని, కేవలం వర్షాధారిత పంటలు పండే తెలంగాణ లాంటి ప్రాంతాలు అభివృద్ధి చెందినట్లు చరిత్రలో లేదని కంచె ఐలయ్య అన్నారు. అందుకే తాను ఉద్యమం ప్రారంభంలోనే తెలంగాణ వస్తే నష్టమని తెలిపినట్లు కంచె ఐలయ్య పేర్కొన్నారు.